సోమవారం 13 జూలై 2020
Sports - Apr 19, 2020 , 20:02:59

లారా కంటే స‌చిన్‌ను ఔట్ చేయ‌డం క‌ష్టం: గెల‌స్పీ

లారా కంటే స‌చిన్‌ను ఔట్ చేయ‌డం క‌ష్టం:  గెల‌స్పీ

ముంబై: క‌్రికెట్ దిగ్గ‌జాలు స‌చిన్ టెండూల్క‌ర్‌, బ్రియాన్ లారాను ఔట్ చేయ‌డం క‌ష్ట‌మైన విష‌యమ‌ని.. అయితే ఇద్దరిలో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌ను పెవిలియ‌న్ పంప‌డం మ‌రింత క‌ష్ట‌మ‌ని ఆసీస్ మాజీ పేస‌ర్ జాసెన్ గెల‌స్పీ అన్నాడు. తన కెరీర్‌లో వీరిద్ద‌రినీ ఔట్ చేసేందుకు తీవ్రంగా శ్ర‌మించిన‌ట్లు ఈ కంగారూ బౌల‌ర్ చెప్పాడు. 

`ఆ ఇద్ద‌రు (స‌చిన్‌, లారా) భిన్న‌మైన ప్లేయ‌ర్లు. వాళ్లిద్ద‌రినీ ఔట్ చేయ‌డం అంత తేలిక కాదు. అయితే ఈ ఇద్ద‌రిలో ఎవ‌రి వికెట్ తీయ‌డం క‌ష్టం అంటే మాత్రం అది స‌చిన్ టెండూల్క‌ర్‌దే. లారా కాస్త దూకుడుగానే ఉంటాడు కాబ‌ట్టి అత‌డు త‌ప్పులు చేసే చాన్స్‌లు ఉంటాయి. కానీ స‌చిన్ డిఫెన్స్‌లో సూప‌ర్‌. అత‌డి అడ్డుగోడ‌ను ఛేదించ‌డం చాలా క‌ష్టం. ఇలాంటి గొప్ప ఆట‌గాళ్ల‌కు బౌలింగ్ చేసినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా` అని గెల‌స్పీ అన్నాడు.


logo