గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 18, 2020 , 09:33:54

లారియ‌స్ అవార్డు అందుకున్న స‌చిన్ టెండూల్క‌ర్‌

లారియ‌స్ అవార్డు అందుకున్న స‌చిన్ టెండూల్క‌ర్‌

హైద‌రాబాద్‌:  మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌.. లారియ‌స్ క్రీడా పుర‌స్కారాన్ని అందుకున్నారు.  బెర్లిన్‌లో జ‌రిగిన వేడుక‌లో ఈ అవార్డును అంద‌జేశారు.  బెస్ట్ స్పోర్టింగ్ మూమెంట్ క్యాట‌గిరీలో.. స‌చిన్‌ను ఆ అవార్డు వ‌రించింది.   2011లో టీమిండియా వ‌న్డే వర‌ల్డ్ క‌ప్ గెలిచిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో స‌చిన్‌ను ప్లేయ‌ర్లు అంతా భుజాలపై ఎత్తుకుని స్టేడియంలో తిరిగారు. బెస్ట్ స్పోర్ట్స్ మూమెంట్ క్యాటగిరీలో .. ఓటింగ్‌లో స‌చిన్ ఆ అవార్డును గెలుచుకున్నాడు.  ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా చేతుల మీదుగా స‌చిన్‌.. లారియ‌స్ అవార్డును అందుకున్నారు.  

వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను గెల‌వ‌డం అద్భుత‌మైన సంద‌ర్భ‌మ‌ని స‌చిన్ అన్నాడు.  వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలవ‌డం అంటే అది మాట‌ల‌కు అంద‌ని భావ‌న అన్నారు.  భిన్నాభిప్రాయాలు లేనటువంటి సంద‌ర్భాలు చాలా అరుదుగా వ‌స్తుంటాయ‌ని, ఇండియా వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన సంద‌ర్భంలో దేశ‌మంతా సంబ‌రాలు జ‌రిగాయ‌న్నారు. క్రీడ‌లు ఎంత శ‌క్తివంత‌మైన‌వో ఈ ఘ‌ట‌న‌లే నిజం చేస్తాయ‌ని స‌చిన్ అన్నారు.  టెన్నిస్ దిగ్గ‌జం బోరిస్ బేక‌ర్ వేసిన ఓ ప్ర‌శ్న‌కు కూడా స‌చిన్ స‌మాధానం ఇచ్చారు. ట్రోఫీని పట్టుకునేందుకు 22 ఏళ్లు ప‌ట్టింద‌ని, కానీ తానెన్న‌డూ నిరాశ చెంద‌లేద‌న్నాడు.  


logo