గురువారం 02 జూలై 2020
Sports - Apr 23, 2020 , 00:01:37

పుట్టిన రోజు వేడుకలకు సచిన్‌ దూరం

పుట్టిన రోజు వేడుకలకు సచిన్‌ దూరం

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఈసారి తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండబోతున్నాడు. ఈనెల 24న 47వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న మాస్టర్‌..కరోనా వైరస్‌పై పోరాడుతున్న సిబ్బందికి సంఘీభావంగా పుట్టిన రోజును జరుపుకోవద్దని నిర్ణయం తీసుకున్నాడట. ‘బర్త్‌ డే  చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదు. ప్రమాదకర కరోనా వైరస్‌తో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది, పోలీసులు, డిఫెన్స్‌ బలగాలకు మాస్టర్‌ మద్దతుగా నిలువాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడేందుకు అంతగా ఆసక్తితో లేడు’ అని అతని సన్నిహిత వర్గాలు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే..సచిన్‌ పుట్టిన రోజును వినూత్నంగా జరిపేందుకు దేశ వ్యాప్తంగా పలు ఫ్యాన్స్‌ క్లబ్‌లు సిద్ధమవుతున్నాయి. ఇందులో ఒక క్లబ్‌.. సచిన్‌ 40 అరుదైన ఫొటోలను విడుదల చేసేందుకు రెడీ అవుతుంటే..మరో క్లబ్‌ ఇన్నేండ్లలో అతను చేసిన సహాయ కార్యక్రమాలను హైలెట్‌ చేయబోతున్నది. ప్రమాదకర కొవిడ్‌-19 పోరులో భాగంగా ఇప్పటికే సచిన్‌ తన వంతు సహాయంగా రూ.50 లక్షల విరాళమిచ్చిన సంగతి తెలిసిందే. logo