శుక్రవారం 22 జనవరి 2021
Sports - Jan 02, 2021 , 01:13:08

అనుబంధాలకు విలువ ఇద్దాం: సచిన్‌

అనుబంధాలకు విలువ ఇద్దాం: సచిన్‌

ముంబై: నూతన సంవత్సరం సందర్భంగా భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ప్రత్యేక సందేశాన్ని ఇచ్చాడు. తన అధికారిక ట్విట్టర్‌ వేదికగా అభిమానులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలుపుతూ 2021 కొత్తగా మొదలుపెడుతామంటూ రాసుకొచ్చాడు. ‘2021 సంవత్సరంలో సంతోషంతో పాటు ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉందాం. గతేడాది మనకు కనువిప్పు కల్గించిన పాఠాలను ఇకముందు కొనసాగిద్దాం. వరంలా దొరికిన ప్రకృతిని మనం నిర్లక్ష్యం చేయడం తగదు. అనుబంధాలకు విలువిస్తూ.. మనల్ని ప్రేమించే వాళ్లతో ఎప్పుడూ బంధాలను కొనసాగిద్దాం’ అని మాస్టర్‌ ట్వీట్‌ చేశాడు. 

తాజావార్తలు


logo