శుక్రవారం 07 ఆగస్టు 2020
Sports - Jul 13, 2020 , 12:33:30

విండీస్ విజ‌యం.. ప్ర‌శంసించిన‌ స‌చిన్‌, కోహ్లి

విండీస్ విజ‌యం.. ప్ర‌శంసించిన‌ స‌చిన్‌, కోహ్లి

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో తీవ్ర ఆంక్ష‌ల న‌డుమ ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ జ‌ట్టు విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. నాలుగు వికెట్ల తేడాతో నెగ్గిన విండీస్‌పై ప్ర‌శంస‌లు జల్లు కురుస్తున్న‌ది. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌,  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలు.. విండీస్ ప్లేయ‌ర్ల‌ను పొగుడుతూ ట్వీట్ చేశారు.  రెండు జ‌ట్ల ప్లేయ‌ర్లు అద్భుత‌మైన ఆట‌ను ప్ర‌ద‌ర్శించిన‌ట్లు స‌చిన్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.  అత్యంత కీల‌క‌మైన ద‌శ‌లో జెర్నేన్ బ్లాక్‌వుడ్ ఉత్కంఠబ‌రిత‌ ఇన్నింగ్స్‌ను ఆడిన‌ట్లు స‌చిన్ చెప్పాడు. ఈ గెలుపుతో సిరీస్ ఆస‌క్తిక‌రంగా మారిన‌ట్లు స‌చిన్ అభిప్రాయ‌ప‌డ్డారు.  ఇక టీమిండియా కెప్టెన్ కోహ్లీ కూడా విండీస్ విజ‌యాన్ని మెచ్చుకున్నారు.  విండీస్ వీరులు అద్భుతంగా పోరాడినట్లు ట్వీట్ చేశారు. టెస్ట్ క్రికెట్ మ‌జాగా సాగిదంన్నారు. 

క‌రోనా వైరస్‌ మహమ్మారి ఆందోళనల మధ్య మొదలైన తొలి సిరీస్‌లో వెస్టిండీస్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఇంగ్లండ్‌తో ఆదివారం ఇక్కడ ముగిసిన మొదటి టెస్టులో విండీస్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. యువ ఆటగాడు బ్లాక్‌వుడ్‌ (95; 12 ఫోర్లు) అదరగొట్టడంతో.. 200 పరుగుల లక్ష్యాన్ని కరీబియన్‌ జట్టు 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. గాబ్రియల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'అవార్డు దక్కింది. ఉమ్మిపై నిషేధం విధించడం, ప్రేక్షకులను అనుమతించకపోవడం మినహా ఆటలో పెద్దగా మార్పులు కనిపించలేదు.


logo