ఆదివారం 05 జూలై 2020
Sports - Apr 28, 2020 , 23:41:50

పృథ్వీ షాకు సచిన్‌ సూచనలు

పృథ్వీ షాకు సచిన్‌ సూచనలు

ముంబై: యువ ఆటగాడు పృథ్వీ షాతో తరచూ మాట్లాడుతుంటానని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అన్నాడు. అపార ప్రతిభగల పృథ్వీ.. టీమ్‌ఇండియా తరఫున టెస్టు అరంగేంట్రంలోనే శతక్కొట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆసీస్‌ పర్యటన సందర్భంగా గాయపడ్డ షా.. అనంతరం డోపింగ్‌ కారణంగా ఎనిమిది నెలల నిషేధం ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో మాస్టర్‌.. పృథ్వీలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు దిశానిర్దేశం చేసినట్లు పేర్కొన్నాడు. కేవలం ఆటకు సంబంధించిన విషయాల గురించే కాక.. జీవితం గురించి కూడా అతడికి విలువైన సూచనలు ఇచ్చినట్లు చెప్పాడు. 


logo