గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Feb 23, 2021 , 13:21:58

ఫ్రీగా స‌చిన్ క్రికెట్ పాఠాలు.. ఎక్క‌డ చూడాలి?

ఫ్రీగా స‌చిన్ క్రికెట్ పాఠాలు.. ఎక్క‌డ చూడాలి?

ముంబై: క‌్రికెట్ లెజెండ్ స‌చిన్ టెండూల్క‌ర్ సచిన్ టెండూల్క‌ర్ కొత్త అవ‌తార‌మెత్తాడు. ఎడ్యుకేష‌న్ టెక్ స్టార్ట‌ప్ అయిన అన్అకాడ‌మీలో పెట్టుబ‌డి పెట్టాడు. దానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారిన స‌చిన్‌.. ఇక నుంచి ఫ్రీగా పాఠాలు కూడా చెప్ప‌నున్నాడు. అన్అకాడమీలోకి వెళ్లి స‌చిన్ చెప్పే క్రికెట్ పాఠాల‌ను ఎవ‌రైనా ఉచితంగా చూడ‌వ‌చ్చు. స‌చిన్ త‌న జీవిత పాఠాల‌ను పంచుకుంటాడ‌ని, లెర్న‌ర్స్‌కు కోచింగ్ ఇస్తాడ‌ని అన్అకాడ‌మీ కోఫౌండ‌ర్ గౌర‌వ్ ముంజాల్ చెప్పారు. స్పోర్ట్స్ లెర్నింగ్ కేట‌గిరీలో స‌చిన్ ద్వారా మ‌రింత లోతుగా పాఠాలు చెప్పించ‌డానికి ఈ స్టార్ట‌ప్ ప్లాన్ చేస్తోంది. 

ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నా..

త‌న జీవిత పాఠాల‌ను విద్యార్థుల‌తో పంచుకోవాల‌ని తాను ఎప్ప‌టి నుంచో భావిస్తున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా స‌చిన్ చెప్పాడు. త‌న విజ‌న్ అన్అకాడ‌మీ మిష‌న్ ఒకేలా ఉండ‌టంతో ఇద్ద‌రం క‌లిసి ఈ ఆలోచ‌న చేసిన‌ట్లు మాస్ట‌ర్ తెలిపాడు. దేశంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్లు కూడా నేర్చుకునేందుకు అన్అకాడ‌మీ ఓ వార‌ధిలాగా మారింద‌ని స‌చిన్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఇందులో ఇప్ప‌టికే 49 వేల మందికిపైగా టీచ‌ర్లు ఉన్నారు. నెల‌కు 100 కోట్ల నిమిషాల వాచ్‌టైమ్‌తో అన్అకాడ‌మీ దూసుకెళ్తోంది. 

VIDEOS

logo