శుక్రవారం 07 ఆగస్టు 2020
Sports - Jul 07, 2020 , 06:51:41

సచిన్‌ ఎప్పుడూ స్ట్రైక్‌ తీసుకునేవాడు కాదు : గంగూలీ

సచిన్‌ ఎప్పుడూ స్ట్రైక్‌ తీసుకునేవాడు కాదు : గంగూలీ

న్యూఢిల్లీ : భారత ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఓపెనర్‌గా స్ట్రైకింగ్ తీసుకోకపోవడానికి కారణాలను టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ తెలిపాడు. 'దాదా ఓపెన్స్ విత్ మయాంక్' పేరుతో మయాంక్ అగర్వాల్ ట్విటర్‌లో  ఓ కార్యక్రమం నిర్వహించాడు. ఈ సందర్భంగా సచిన్ తొలి బంతిని ఎదుర్కోకపోవడానికి, సహచరుడిని స్ట్రైకింగ్ తీసుకోమని బలవంతం చేయడగానికి కారణం ఏంటని మయాంక్ దాదాను ప్రశ్నించాడు. అందుకు స్పందించిన దాదా ‘సచిన్ ఎప్పుడూ స్ట్రైకింగ్ తీసుకోవడానికి ఆసక్తి చూపేవాడు కాదు. తొలి బంతిని ఫేస్ చేయమని నేనూ తరుచూ చెప్పేవాడిని. ఎందుకంటే ఎప్పుడూ నేనే స్ట్రైక్ తీసుకునేవాడిని. దానికి సచిన్ రెండు సమాధానాలు చెప్పేవాడు.

అతను ఫామ్‌లో ఉంటే నాన్‌స్ట్రైక్‌లో ఉంటాననేవాడు. ఫామ్‌లో లేకున్నా నన్నే స్ట్రైకింగ్ తీసుకోమనేవాడు. తన మీద ఎలాంటి ఒత్తిడి ఉండకూడదని చెప్పేవాడు. అలా ఒకటి రెండు సార్లు నేనే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో నిలబడ్డా' అని గంగూలీ గుర్తుచేసుకున్నాడు. సచిన్-గంగూలీ ఓపెనింగ్ ధ్వయం భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలందించింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే 9వ విజయవంతమైన జోడీగా గుర్తింపుపొంది.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo