మంగళవారం 07 జూలై 2020
Sports - May 10, 2020 , 16:55:11

స‌చిన్‌కు మాత్ర‌మే చోటు

స‌చిన్‌కు మాత్ర‌మే చోటు

ఆల్‌టైమ్ వ‌ర‌ల్డ్ బెస్ట్ ఎలెవ‌న్ ప్ర‌క‌టించిన దిల్షాన్‌

న్యూఢిల్లీ: శ్రీ‌లంక మాజీ క్రికెట‌ర్ తిల‌క‌ర‌త్నె దిల్షాన్ త‌న అత్యుత్త‌మ ప్ర‌పంచ వ‌న్డే జ‌ట్టును ప్ర‌క‌టించాడు అందులో భార‌త్ నుంచి కేవ‌లం మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌కు మాత్ర‌మే చోటు ద‌క్కింది. మాస్ట‌ర్‌ను ఓపెన‌ర్‌గా ఎంపిక చేసిన దిల్షాన్ జ‌య‌సూర్య‌, మాస్ట‌ర్‌ను మించిన ఓపెన‌ర్లు ఈ ప్ర‌పంచంలో లేర‌ని పేర్కొన్నాడు. జ‌య‌సూర్య దూకుడుతో కూడిన బ్యాటింగ్ చేస్తే.. స‌చిన్ స్టైలిష్ బ్యాట్స్‌మ‌న్ అని వివ‌రించాడు. కుడి, ఎడ‌మ కాంబినేష‌న్ కావ‌డం ఇంకా గొప్ప అంశ‌మ‌న్నాడు. ఇక మూడో స్థానంలో లారాను ఎంపిక చేసిన దిల్షాన్ నాలుగో స్థానంలో జ‌య‌వ‌ర్ధేనేకు చోటు క‌ల్పించాడు. 

అయితే త‌న క‌ల‌ల జ‌ట్టుకు కెప్టెన్‌గా మాత్రం ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను ఎంపిక చేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌తో పాటు నాయ‌క‌త్వ ల‌క్షణాల్లో పంట‌ర్‌.. ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ‌మ‌ని చెప్పుకొచ్చాడు. ఆరు, ఏడు స్థానాల్లో ద‌క్షిణాఫ్రికా మాజీ ఆట‌గాళ్లు జాక్వ‌స్ క‌లీస్‌, ఏబీ డివిలియ‌ర్స్‌ను ఎంపిక చేశాడు. బౌలింగ్ విభాగంలో.. వసీం అక్ర‌మ్‌, కోట్నీ వాల్ష్‌, ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్‌, షేన్‌వార్న్‌కు చాన్స్ ఇచ్చాడు. 


logo