సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Mar 07, 2020 , 16:06:34

క్రికెట్‌ లెజెండ్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పిన సచిన్‌, కోహ్లి..

క్రికెట్‌ లెజెండ్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పిన సచిన్‌, కోహ్లి..

లెజెండరీ క్రికెటర్‌, కరీబియన్‌ కింగ్‌.. సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ పుట్టిన రోజు ఇవాళ. ఈ రోజుతో ఆయన 68వ వసంతంలోకి ప్రవేశించారు. కాగా, రిచర్డ్స్‌కు.. క్రికెట్‌ గాడ్‌గా పేరుగాంచిన సచిన్‌ టెండూల్కర్‌, భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ట్విట్టర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు సర్‌ వివ్‌.. అంటూ తెలిపిన సచిన్‌, మీ బ్యాటింగ్‌ చూడడం తమకు కలిగిన భాగ్యమనీ.. మీతో తనకు ఉన్న అనుబంధం అదృష్టమని తెలిపాడు. మీరు కుటుంబసమేతంగా ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవించాలని సచిన్‌ ఆకాంక్షించాడు. 

హ్యాపీ బర్త్‌డే సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌. మీరు జీవితంలో సాధించిన ఘనతలు ఎప్పటికీ మరిచిపోలేనివనీ.. మీ జీవితం సంతోషంగా, ఆరోగ్యంగా గడవాలనీ.. ఈ రోజు నుంచి ఇంకా ప్రత్యేకంగా ఉండాలని కోహ్లి ఆకాంక్షించాడు. ప్రతి క్రికెటర్‌కు స్ఫూర్తి రిచర్డ్స్‌ అని కింగ్‌కోహ్లి తెలిపాడు. టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్‌ కైఫ్‌ కూడా రిచర్డ్స్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. క్రికెట్‌ కింగ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలని కైఫ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు.  

రిచర్డ్స్‌ క్రికెట్‌ కేరీర్‌..

టెస్టుల్లో 121 మ్యాచ్‌లాడిన రిచర్డ్స్‌ 50.2 సగటుతో 8,540 పరుగులు చేశాడు.  వన్డేల్లో 187 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించిన రిచర్డ్స్‌.. 47.0 సగటుతో 6,721 పరుగులు సాధించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో వివియన్‌ 507 మ్యాచ్‌లాడి 36,212 పరుగులు సాధించాడు. తన తొలి టెస్ట్‌ మ్యాచ్‌ను 1974లో ఇండియాతో ఆడిన రిచర్డ్స్‌.. తొలి వన్డే మ్యాచ్‌ను 1975లో శ్రీలంకతో ఆడాడు. చివరి వన్డే 1991లో ఇంగ్లాండ్‌తో ఆడాడు. 


logo