శనివారం 28 మార్చి 2020
Sports - Jan 12, 2020 , 01:59:18

లారియస్‌ అవార్డు రేసులో సచిన్‌

లారియస్‌ అవార్డు రేసులో సచిన్‌

లండన్‌ : 2011 ప్రపంచకప్‌ గెలిచాక క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ను టీమ్‌ఇండియా ఆటగాళ్లు భుజాలపై ఎత్తుకొని వాంఖడే మైదానమంతా తిప్పిన దృశ్యం ఇప్పటికీ ఎంతో మంది కండ్ల ముందటే మెదులుతూ ఉంటుంది. దాదాపు తొమ్మిదేండ్ల తర్వాత ఆ సందర్భం ప్రతిష్ఠాత్మక లారియస్‌ అవార్డుకు నామినేటైంది. 2000-2020 మధ్యకాలంలో క్రీడల్లో ఉత్తమ సందర్భానికి ఇచ్చే లారియస్‌ స్పోర్టింగ్‌ మూవ్‌మెంట్‌ అవార్డు కోసం 20మంది పోటీలో ఉండగా.. సచిన్‌ కూడా రేసులో నిలిచాడు. ఈ విషయాన్ని లారియస్‌ అకాడమీ సభ్యుడు, ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌ వా ప్రకటించాడు. ‘క్రికెట్‌లో అదో అద్భుతమైన సందర్భం. భారత్‌ సాధించిన గొప్ప విజ యం. ప్రస్తుతం టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడుతున్నది’ అని వా పేర్కొన్నాడు.


logo