బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Mar 27, 2020 , 12:19:51

‘లిటిల్ మాస్టర్’ సాయం రూ.50లక్షలు

‘లిటిల్ మాస్టర్’ సాయం రూ.50లక్షలు

కరోనా బాధితుల సహాయార్థం భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రూ.50లక్షల విరాళం ప్రకటించారు. ప్రధాన మంత్రి సహాయనిధికి రూ.25లక్షలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షల చొప్పున సాయం అందజేయనున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌ నియంత్రణకు కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందుకోసం తనవంతుగా ఈ విరాళం ఇస్తున్నానని సచిన్‌ తెలిపినట్లు  ఆయన సన్నిహితుడొకరు వెల్లడించారు.   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న పోరాటానికి తమ వంతు సాయం అందించేందుకు ఇప్పటికే పలువురు క్రీడాకారులు ముందుకొచ్చారు.

ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు తెలుగు రాష్ర్టాలకు రూ.10 లక్షల విరాళం ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.5లక్షలను అందించినట్టు  ఆమె ట్వీట్‌ చేసింది.  క్రీడాకారులు తమ వేతనాలను విరాళంగా ఇవ్వడంతో పాటు వైద్య సామాగ్రి, పేదలకు రేషన్‌, అత్యవసర సేవలందిస్తున్న వారికి మాస్క్‌లు తదితర సాయాన్ని అందిస్తున్నారు. logo