శుక్రవారం 22 జనవరి 2021
Sports - Dec 28, 2020 , 13:13:22

ఈ అంపైర్స్ కాల్ ఏంటి.. డీఆర్ఎస్‌పై స‌చిన్ అసంతృప్తి

ఈ అంపైర్స్ కాల్ ఏంటి.. డీఆర్ఎస్‌పై స‌చిన్ అసంతృప్తి

ముంబై: మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ అంపైర్ డెసిష‌న్ రీవ్యూ సిస్ట‌మ్‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. ముఖ్యంగా ఇందులోని అంపైర్స్ కాల్‌ను అత‌ను ప్ర‌శ్నించాడు. అస‌లు ఫీల్డ్ అంపైర్ నిర్ణ‌యంపై అసంతృప్తితోనే ప్లేయ‌ర్స్ డీఆర్ఎస్ కోర‌తార‌ని, అలాంట‌ప్పుడు ఈ అంపైర్స్ కాల్ ఏంటి అని స‌చిన్ ట్వీట్ చేశాడు. ఈ డీఆర్ఎస్‌ను ఐసీసీ క్షుణ్నంగా ప‌రిశీలించాలి. ముఖ్యంగా అంపైర్స్ కాల్‌ను అని మాస్ట‌ర్ ట్వీట్ చేశాడు. ఈ అంపైర్స్ కాల్ నిబంధ‌న కార‌ణంగానే రెండో టెస్ట్‌లో టీమిండియా రెండు వికెట్ల‌ను తీయ‌లేక‌పోయింది. బంతి వికెట్ల‌ను త‌గులుతున్న‌ట్లు బాల్ ట్రాకింగ్‌లో తేలినా.. అంపైర్స్ కాల్ అని రావ‌డంతో వాటిని నాటౌట్‌గానే ప్ర‌క‌టించారు. అంపైర్స్ కాల్ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. 50-50 చాన్స్ ఉన్న‌పుడు లేదా బంతి నేరుగా వికెట్ల‌ను త‌గ‌ల‌కుండా కేవ‌లం అలా అంచుల‌ను తాకుతూ వెళ్తుంద‌ని తేలిన‌ప్పుడు ఫీల్డ్ అంపైర్ నిర్ణ‌యమే నిలుస్తుంది. 


logo