గురువారం 16 జూలై 2020
Sports - May 17, 2020 , 13:05:34

నీ ఛాలెంజ్ నాకు తేలికే.. నా ఛాలెంజ్ నీకు చాలా క‌ష్టం కాస్కో..!

నీ ఛాలెంజ్ నాకు తేలికే.. నా ఛాలెంజ్ నీకు చాలా క‌ష్టం కాస్కో..!

హైద‌రాబాద్‌: మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ చేసిన ఒక అద్భుత‌మైన‌ ఫీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ విసిరిన ఒక స‌వాల్‌ను స్వీక‌రించిన స‌చిన్.. అందుకు ప్ర‌తి స‌వాల్ విసురుతూ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకుంటున్న‌ది.  క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం నేను ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నా. అందుకే స‌ర‌దాగా లిటిల్ మాస్ట‌ర్ స‌చిన్‌, రోహిత్ శ‌ర్మ‌, హ‌ర్భ‌జ‌న్‌సింగ్‌ల‌కు ఒక స‌వాల్ విసురుతున్నా అంటూ యువ‌రాజ్ సింగ్ క్రికెట్ బ్యాట్ ఎడ్జ్‌తో బంతిని కింద‌ప‌డ‌కుండా పైకి కొడుతున్న ఒక వీడియోను పోస్ట్ చేశాడు. త‌న స‌వాల్‌ను స‌చిన్, రోహిత్ సుల‌భంగా స్వీక‌రించ‌గ‌ల‌రుకానీ హ‌ర్బ‌జ‌న్‌కు మాత్రం క‌ష్ట‌మే అని వీడియోలో యువీ కామెంట్ చేశాడు.

అయితే, యువ‌రాజ్ ఊహించిన‌దానికంటే చాలా ఈజీగా అత‌ని స‌వాల్‌ను స్వీక‌రించాడు స‌చిన్‌. యువీ కేవ‌లం బ్యాట్ ఎడ్జ్‌తో బంతిని కింద‌ప‌డ‌కుండా కొడుతూ స‌చిన్‌కు స‌వాల్ విసిరితే.. స‌చిన్ మాత్రం కండ్ల‌కు గంత‌లు క‌ట్టుకుని మ‌రీ బ్యాట్ ఎడ్జ్‌తో బంతి కింద‌ప‌డ‌కుండా పైకి కొడుతూ ప్ర‌తి స‌వాల్ విసిరాడు. ‘యువీ నువ్వు నాకు చాలా సులభమైన ఛాలెంజ్ ఇచ్చావు. కానీ నేను నీకిప్పుడు కష్టమైన ఛాలెంజ్ విసురుతున్నా కాస్కో అంటూ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. సచిన్‌ చేసిన ఈ ఫీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది. నెటిజన్లనేకాక‌ పలువురు క్రికెటర్లను సైతం స‌చిన్ వీడియో ఆక‌ర్షిస్తున్న‌ది. logo