ఆదివారం 29 మార్చి 2020
Sports - Feb 10, 2020 , 02:38:35

సచిన్‌ బ్యాట్‌ పట్టిన వేళ

సచిన్‌ బ్యాట్‌ పట్టిన వేళ

మెల్‌బోర్న్‌: క్రికెట్‌ దేవుడు సచిన్‌ రమేశ్‌ టెండూల్కర్‌ దాదాపు ఆరేండ్ల తర్వాత మైదానంలో బ్యాట్‌పట్టి అభిమానులను తరింపజేశాడు. ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల కోసం 22 గజాల పిచ్‌పై కాలుమోపి ఐదు నిమిషాల పాటు బ్యాటింగ్‌ చేశాడు. విరాళాల సేకరణ కోసం ఆస్ట్రేలియా సూపర్‌స్టార్‌ మహిళల మ్యాచ్‌ విరామ సమయంలో సచిన్‌ బ్యాటింగ్‌కు దిగాడు. ఆసీస్‌ మహిళా క్రికెటర్‌ ఎలెసా పెర్రీ వేసిన ఆరు బంతులను సచిన్‌ ఎదుర్కొన్నాడు. తొలి బంతినే ఫైన్‌లెగ్‌ దిశగా బౌండ్రీకి తరలించి అభిమానులను అలరించాడు. 


మరోసారి లారా మ్యాజిక్‌ 

విరాళాల సేకరణ కోసం జరిగిన పురుషుల 10 ఓవర్ల మ్యాచ్‌లో పాంటింగ్‌ ఎలెవెన్‌ తరఫున బరిలోకి దిగిన విండీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా తనదైన శైలిలో చెలరేగిపోయాడు. స్టయిలిష్‌ కవర్‌డ్రైవ్‌లు, స్ట్రయిట్‌ డ్రైవ్‌లతో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పాంటింగ్‌ ఎలెవెన్‌ జట్టు 10 ఓవర్లలో 104/5 చేస్తే.. ఆ తర్వాత గిల్‌క్రిస్ట్‌ ఎలెవెన్‌ 103/6 దగ్గరే ఆగిపోయింది. యువరాజ్‌ సింగ్‌ (2) నిరాశ పరిచాడు.


logo