సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 20, 2020 , 00:43:28

నా ‘మారుతి’ని వెతికి పెట్టండి

నా ‘మారుతి’ని వెతికి పెట్టండి

ముంబై: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు కార్ల అంటే వల్లమాలిన ప్రేమ. క్రికెట్‌లోకి రాకముందు నుంచే ఇలాంటి కార్లు కొంటే బాగుండని మాస్టర్‌ కలలు కనేవాడట. ‘ఇన్‌ ద స్పాట్‌లైట్‌' అనే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ముదిత్‌ దానీతో కలిసి సచిన్‌ గత స్మృతులను గుర్తుకు తెచ్చుకున్నాడు. కార్లపై తనకున్న ప్రేమకు తోడు తన ఆరాధ్య క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ను తొలిసారి కలుసుకున్న సందర్భాన్ని సచిన్‌ అభిమానులతో కలిసి పంచుకున్నాడు. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా మారిన తొలినాళ్లలో సొంత డబ్బుతో కొన్న ‘మారుతి 800’ కారుతో ఉన్న అనుబంధంపై మాస్టర్‌ మాట్లాడుతూ ‘మారుతి కారుతో నాది విడదీయరాని బంధం. సెంటిమెంట్‌ పరంగా నాకు బాగా కలిసొచ్చిన కారు అది. కానీ ఇప్పుడు నా దగ్గర లేదు. ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్లు ఎప్పుడైనా నన్ను సంప్రదించవచ్చు. ఆ కారును మళ్లీ గ్యారేజీలో చూడాలనుకుంటున్నా. ఈ విషయంలో కారు యజమాని ఎవరో అభిమానులను వెతికి పెట్టమని కోరుకుంటున్నా’ అని అన్నాడు. రంజీల్లో అరంగేట్రం చేసేటప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌లో గవాస్కర్‌ కూర్చున్న స్థానం నుంచే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినట్లు సచిన్‌ చెప్పుకొచ్చాడు. 


logo