శనివారం 04 జూలై 2020
Sports - Apr 13, 2020 , 19:14:59

స‌చిన్‌, ద్రవిడ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్‌: స‌్టెయిన్

స‌చిన్‌, ద్రవిడ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్‌: స‌్టెయిన్

స‌చిన్‌, ద్రవిడ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్‌: స‌్టెయిన్ 

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఏర్ప‌డిన లాక్‌డౌన్ స‌మ‌యాన్ని క్రికెట‌ర్లు చ‌క్క‌గా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. త‌మ పాత జ్ఞ‌పకాల‌ను గుర్తుకు తెచ్చుకుని అభిమానుల‌తో పంచుకుంటున్నారు. తాజాగా ద‌క్షిణాఫ్రికా స్పీడ్‌స్ట‌ర్ డెయిల్ స్టెయిన్ ట్విట్ట‌ర్‌లో ప‌లువురు ఫ్యాన్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిచ్చాడు.  

ఐదుగురు అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌ వీరేనంటూ స్టెయిన్ వెల్ల‌డించాడు. ఇందులో భార‌త క్రికెట్ దిగ్గ‌జాలు స‌చిన్ టెండూల్క‌ర్‌, రాహుల్ ద్రవిడ్‌తో స‌హా రికీ పాంటింగ్, క్రిస్ గేల్‌, కెవిన్ పీట‌ర్స‌న్ ఉన్నారు. ఇక ఫ‌ర్‌ఫెక్ట్ బౌలింగ్ యాక్ష‌న్ ఎవ‌రిదంటూ అడ‌గ‌గా ద‌క్షిణాఫ్రికా యువ పేస‌ర్ క‌గిసో ర‌బాడ‌, ప్యాట్ క‌మ్మిన్స్ అని పేర్కొన్నాడు. త‌రుచు గాయాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నఈ సీనియ‌ర్ పేస‌ర్‌..గ‌తేడాది టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి వన్డేలు, టీ20ల‌కు ప‌రిమిత‌మ‌వుతాన‌ని ప్ర‌క‌టించాడు. 


logo