హన్మకొండ సిటీ, మార్చి 28 : అదనపు ఎస్పీ నుంచి నాన్‌క్యాడర్ ఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది, ఈస్ట్‌జోన్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కొల్లి వెంకటలక్ష్మి ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనర్ పీ ప్రమోద్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, మొక్క అందజేశారు. 2010లో పోలీస్ విభాగంలో డీఎస్పీగా చేరిన వెంకటలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దర్శిలో పనిచేశారు. అలాగే, ఆర్థిక నేరాల విభాగం ఓఎస్డీగా కూడా పనిచేశారు. తర్వాత అదనపు ఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది పోలీస్ అకాడమిలో పనిచేసి, 2019 జూలై నుంచి వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పరిపాలనా విభాగం అదనపు డీసీపీగా పనిచేస్తున్నారు.