శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 25, 2020 , 12:20:09

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు కొత్త బౌలింగ్‌ కోచ్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు కొత్త  బౌలింగ్‌ కోచ్‌

దుబాయ్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌) 13వ సీజన్‌  ఆరంభానికి  ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ)   జట్టు మరో కీలక నిర్ణయం  తీసుకుంది. జట్టు కొత్త బౌలింగ్‌   కోచ్‌గా  ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌బౌలర్‌   రియాన్‌ హారీస్‌ని  నియమిస్తున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది.  నవంబర్‌ 19 నుంచి ప్రారంభంకానున్న రాబోయే ఐపీఎల్‌ సీజన్‌ కోసం 40 ఏళ్ల హారీస్‌ యూఏఈలో ఢిల్లీ జట్టుతో కలవనున్నాడు.  2018, 2019 సీజన్లకు జట్టు బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న జేమ్స్‌ హోప్స్‌ వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది జట్టుతో కలిసి ప్రయాణించలేదని ఫ్రాంఛైజీ వెల్లడించింది.  


logo