శనివారం 24 అక్టోబర్ 2020
Sports - Sep 22, 2020 , 21:31:23

RRvCSK: చెన్నై లక్ష్యం 217

RRvCSK: చెన్నై లక్ష్యం 217

షార్జా: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు భారీ స్కోరు చేసింది. సంజూ శాంసన్‌(74: 32 బంతుల్లో 1ఫోర్‌, 9సిక్సర్లు), స్టీవ్‌ స్మిత్‌(69: 47 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు)  మెరుపు అర్ధశతకాలతో చెలరేగడంతో రాజస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 216 పరుగులు చేసింది. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్‌(27 నాటౌట్‌: 8 బంతుల్లో 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్‌ 200 పరుగుల మార్క్‌ను దాటింది.  ఆఖరి ఓవర్‌ వేసిన ఎంగిడి బౌలింగ్‌లో ఆర్చర్‌ మోత మోగించాడు. వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన ఆర్చర్‌ చివరి ఓవర్‌లో 30 పరుగులు రాబట్టాడు.  చెన్నై బౌలర్లలో శామ్‌ కరన్‌ మూడు వికెట్లు తీయగా..దీపక్‌ చాహర్‌, ఎంగిడి, చావ్లా తలో వికెట్‌ తీశారు. 


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ మూడో ఓవర్లోనే 11 పరుగుల వద్ద యువ ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ వికెట్‌ కోల్పోయింది. ఈ దశలో క్రీజలోకి వచ్చిన సంజూ రాజస్థాన్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో కేవలం 19 బంతుల్లోనే  అర్ధశతకం సాధించిన శాంసన్‌ ఎంగిడి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి చాహర్‌ చేతికి చిక్కాడు. నిలకడగా ఆడుతున్న స్టీవ్‌ స్మిత్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 13 ఓవర్లకే  రాజస్థాన్‌ 3 వికెట్లకు 137 పరుగులు చేసింది. పుంజుకున్న  చెన్నై బౌలర్లు మిడిలార్డర్‌ను కుప్పకూల్చారు.   ఆఖర్లో ఆర్చర్‌ ఉతికారేయడంతో రాజస్థాన్‌ ఊహించని స్కోరుకు సాధించింది. 


logo