శుక్రవారం 10 జూలై 2020
Sports - Feb 14, 2020 , 13:07:35

ఆర్‌సీబీ ఇక ‘రాయల్ చాలెంజర్స్’..

ఆర్‌సీబీ ఇక ‘రాయల్ చాలెంజర్స్’..

మార్చి 29 నుంచి ఐపీఎల్‌ 2020 సీజన్‌ ఆరంభంకానుంది.

బెంగళూరు  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఫ్రాంఛైజీ రాయల్‌ ఛాలెంజర్స్‌  బెంగళూరు ఈ దశాబ్దాన్నిగొప్పగా ఆరంభించాలని భావిస్తోంది.  ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఆర్‌సీబీ ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. జట్టులో స్టార్‌హిట్టర్లు, ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ పేలవ ప్రదర్శనతో ప్రతీ సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానాలకే పరిమితమైంది. 

ఈ నేపథ్యంలోనే సోషల్‌ మీడియాలో ఆర్‌సీబీ తన ఖాతాల పేర్లలో మార్పులు చేసింది.  రెండు రోజుల క్రితం ప్రొఫైల్‌ ఫొటో, కవర్‌ ఫొటోలను తొలగించిన  ఆర్‌సీబీ యాజమాన్యం తాజాగా ఫ్రాంఛైజీ పేరును రాయల్‌ ఛాలెంజర్స్‌గా పేర్కొంది.   గర్జిస్తున్న సింహాంతో కొత్త లోగోను డిజైన్‌ చేశారు.   

 ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లోనూ ఇలాంటి మార్పులే చేసింది.   పేరుతోనైనా తమ రాత మారుతుందని భావించి.. తమ జట్టు పేరును ఆర్‌సీబీ మార్చుకోవడం విశేషం. గతేడాది ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేరు మార్చుకుని ఢిల్లీ క్యాపిటల్స్‌గా 2019 సీజన్‌కు అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మార్చి 29 నుంచి ఐపీఎల్‌ 2020 సీజన్‌ ఆరంభంకానుంది. logo