గురువారం 26 నవంబర్ 2020
Sports - Sep 17, 2020 , 18:47:23

ఆర్‌సీబీ 'మై కొవిడ్‌ హీరోస్'‌ జెర్సీ చూశారా?

ఆర్‌సీబీ 'మై కొవిడ్‌ హీరోస్'‌  జెర్సీ చూశారా?

దుబాయ్‌: రాబోయే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ కోసం  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) కొత్త జెర్సీని ఆవిష్కరించింది. 'మై కొవిడ్‌ హీరోస్'‌ కార్యక్రమం ద్వారా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న యోధులకు సంఘీభావం ప్రకటించింది.

అహర్నిశలు శ్రమిస్తున్న కొవిడ్‌ యోధుల త్యాగాలు, వారి సేవలను గుర్తించి గౌరవించడంలో భాగంగా ఐపీఎల్‌ 2020  టోర్నీ ముగిసేవరకు శిక్షణ, మ్యాచ్‌ల సమయంలో  'మై కొవిడ్‌ హీరోస్'‌ సందేశంతో ఆర్‌సీబీ బృందం నూతన జెర్సీలను ధరించనుంది. 13వ సీజన్‌లో బెంగళూరు జట్టు ఆడే మొదటి మ్యాచ్‌లో ఆటగాళ్లు ధరించే జెర్సీలను వేలం వేసి వాటి ద్వారా  వచ్చే నగదు మొత్తాన్ని గివ్‌ ఇండియా ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వనున్నారు.