గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Oct 05, 2020 , 19:03:56

RCB vs DC: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న కోహ్లీ

RCB vs DC: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న కోహ్లీ

దుబాయ్‌: ఐపీఎల్‌-13లో   మరో  ఆసక్తికర  సమరం ఆరంభమైంది.  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ దుబాయ్‌ వేదికగా తలపడుతున్నాయి. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన బెంగళూరు ఆత్మవిశ్వాసంతో ఉంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతున్న ఢిల్లీ కూడా జోరుమీదున్నది. రెండు జట్లు సమతూకంగా ఉండటంతో రసవత్తర పోరు జరగనుంది. 

టాస్‌ గెలిచిన బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఆడమ్‌ జంపా, గుర్‌కీరత్‌ మన్‌ స్థానంలో  మొయిన్‌ అలీ, మహ్మద్‌ సిరాజ్‌ తుది జట్టులోకి వచ్చినట్లు విరాట్‌ చెప్పాడు. గాయం కారణంగా ఢిల్లీ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు.    మిశ్రా స్థానంలో అక్షర్‌ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ఢిల్లీ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ చెప్పాడు.