మంగళవారం 20 అక్టోబర్ 2020
Sports - Sep 24, 2020 , 19:09:34

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న కోహ్లీ

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న కోహ్లీ

దుబాయ్: ఐపీఎల్‌ 13లో భాగంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌,  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు ఆరంభమైంది. టాస్‌ గెలిచిన బెంగళూరు కెప్టెన్‌  విరాట్‌ కోహ్లీ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.  తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నట్లు కోహ్లీ చెప్పాడు. మరోవైపు పంజాబ్‌ టీమ్‌లో రెండు మార్పులు జరిగాయి.  జోర్డాన్‌, గౌతమ్‌ స్థానంలో  జిమ్మీ నీషమ్‌, మురుగన్‌ అశ్విన్‌లను జట్టులోకి తీసుకున్నట్లు  ఆ జట్టు సారథి కేఎల్‌ రాహుల్‌ వివరించాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విధ్వంసకర ఓపెనర్‌ క్రిస్‌గేల్‌కు పంజాబ్‌ టీమ్‌లో చోటు దక్కలేదు.


logo