ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 12, 2020 , 19:10:49

RCB vs KKR: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోహ్లీ

RCB vs KKR:  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోహ్లీ

షార్జా:  ఐపీఎల్‌-13లో  సోమవారం రసవత్తర పోరు జరగనుంది. రాయల్‌  ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు  షార్జా వేదికగా తలపడుతున్నాయి.  టాస్‌ గెలిచిన బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.  గుర్‌కీరత్‌  సింగ్ మన్‌ స్థానంలో హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు విరాట్‌ చెప్పాడు.  స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ స్థానంలో  టామ్‌ బాంటన్‌ తుది జట్టులోకి వచ్చినట్లు కోల్‌కతా సారథి దినేశ్‌ కార్తీక్‌ తెలిపాడు. 

పంజాబ్‌తో  మ్యాచ్‌లో  నరైన్  నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్‌ చేసినట్లు  ఫీల్డ్‌ అంపైర్లు మ్యాచ్‌ రెఫరీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  చిన్న మైదానం, ఫ్లాట్‌ వికెట్‌ కావడంతో షార్జాలో భారీ స్కోరు నమోదవుతున్నాయి. రెండు జట్లలో హిట్టర్లు ఉండటంతో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది.  సీజన్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు చెరో ఆరు మ్యాచ్‌లు ఆడగా   నాలుగింటిలో గెలుపొంది రెండింటిలో  ఓడిపోయాయి.