గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Feb 10, 2021 , 15:57:53

ఆర్​సీబీ బ్యాటింగ్​ సలహాదారుగా టీమ్‌ఇండియా మాజీ కోచ్‌

ఆర్​సీబీ బ్యాటింగ్​ సలహాదారుగా టీమ్‌ఇండియా మాజీ కోచ్‌

బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 14వ సీజన్‌ కోసం ప్రాంఛైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఈనెల 18న ఆటగాళ్ల వేలం ప్రక్రియ చెన్నై వేదికగా జరగనుంది. ఐపీఎల్‌-2021 కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా భారత మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్​ బంగర్​ను నియమించినట్లు ప్రకటించింది. ఇంతకుముందు 2014 నుంచి 2016 వరకు మూడు సీజన్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు బంగర్‌ కోచ్‌గా వ్యవహరించాడు. 

2014 నుంచి 2019 ప్రపంచకప్‌ వరకు సంజయ్‌ బంగర్‌ టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ పదవిలో కొనసాగాడు. ఐపీఎల్‌ 2021 సీజన్‌ కోసం బ్యాటింగ్‌ సలహాదారుగా సంజయ్‌ బంగర్‌ను ఆర్‌సీబీ ఫ్యామిలీలోకి స్వాగతిస్తున్నందుకు తామెంతో సంతోషిస్తున్నామని ఫ్రాంఛైజీ ట్వీట్‌ చేసింది. 


 

VIDEOS

logo