శనివారం 29 ఫిబ్రవరి 2020
అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా.. !

అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా.. !

Feb 14, 2020 , 15:59:45
PRINT
అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా.. !

న్యూజిలాండ్‌ వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు.

వెల్లింగ్టన్‌:  న్యూజిలాండ్‌ వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు.  భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ఫిబ్రవరి 21న తొలి టెస్టు ప్రారంభంకానుంది. భారత్‌తో తొలి టెస్టు ద్వారా టెస్టుల్లో టేలర్‌ 100వ మ్యాచ్‌ ఆడబోతున్నాడు. దీంతో అన్ని ఫార్మాట్ల(టెస్టులు, వన్డేలు, టీ20)లో  100 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్‌గా టేలర్‌ నిలువనున్నాడు. కొద్ది రోజుల క్రితం భారత్‌తో టీ20 సిరీస్‌లో  ఐదో టీ20 ఆడటం ద్వారా 100టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన తొలి కివీస్‌ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. 

2007లో జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌ ద్వారా అతడు సుదీర్థ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆప్పటి నుంచి న్యూజిలాండ్‌ టీమ్‌కు వెన్నెముకగా ఉంటూ వచ్చాడు. ఇటీవల భారత్‌తో వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ను చేయడంలో అతడిదే ప్రధాన పాత్ర.  స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, బ్రెండన్‌ మెక్‌కలమ్‌, డేనియల్‌ వెటోరి మాత్రమే టేలర్‌ కన్నా ఎక్కువ టెస్టు మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించారు. టేలర్‌ ఇప్పటి వరకు 99 టెస్టులు, 231 వన్డేలు, 100టీ20లు ఆడగా..ఐపీఎల్‌లో 55 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 


logo