గురువారం 09 జూలై 2020
Sports - Apr 14, 2020 , 20:43:24

పిల్ల‌లతో క‌లిసి రొనాల్డో వ‌ర్క్ఔట్లు

పిల్ల‌లతో క‌లిసి రొనాల్డో వ‌ర్క్ఔట్లు

పిల్ల‌లతో క‌లిసి రొనాల్డో వ‌ర్క్ఔట్లు 

మ‌దిరా: క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ టోర్నీల‌న్నీ వాయిదా, ర‌ద్దయ్యాయి. దీంతో ఆట‌గాళ్లంద‌రు ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ స‌మ‌యంలోనూ తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకు సాక‌ర్ స్టార్లు త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా త‌న‌దైన ఆట‌తీరుతో ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న పోర్చుగ‌ల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఫిట్‌నెస్‌పై ద్రుష్టి పెట్టాడు. 

త‌న ఇంట్లోని కార్ల గ్యారెజీని జిమ్‌గా మార్చేసుకుని రోజు ఎక్స‌ర్‌సైజ‌లు చేస్తున్నాడు. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా కుటుంబం మొత్తం ఇంటికే ప‌రిమితం కావ‌డంతో పిల్ల‌లు..రొనాల్డో వెంట‌ప‌డుతున్నారు. వ్యాయామాలు చేస్తున్న స‌మ‌యంలో పిల్ల‌లు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఆట పట్టిస్తున్నారు. అయినా కూడా రొనాల్డో ఎక్క‌డా  త‌న ఏకాగ్ర‌త‌ను కోల్పోకుండా పిల్ల‌ల‌తో  క‌లిసి వ్యాయ‌మాన్ని కొన‌సాగించాడు. వారిని బ‌రువులుగా ఎత్తుతూ చేస్తున్న ఎక్స‌ర్‌సైజ్ వీడియోను రొనాల్డో త‌న అభిమానుల కోసం సోష‌ల్‌మీడియాలో షేర్ చేశాడు. దీనిపై రొనాల్డో గ‌ర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్స్ బెస్ట్ ట్రైన‌ర్స్ అంటూ పోస్ట్ చేసింది. 


logo