ఆదివారం 17 జనవరి 2021
Sports - May 18, 2020 , 23:10:35

ప్రాక్టీస్‌కు సిద్ధమైన రొనాల్డో

ప్రాక్టీస్‌కు సిద్ధమైన రొనాల్డో

ప్రాక్టీస్‌కు సిద్ధమైన రొనాల్డో 

మదిర: జువెంటస్‌ స్టార్‌ ౖస్ట్రెకర్‌ క్రిస్టియానో రొనాల్డో మంగళవారం నుంచి ప్రాక్టీస్‌ మొదలుపెట్టబోతున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు రెండు నెలలు ఇంటికే పరిమితమైన రొనాల్డో..క్వారంటైన్‌ ముగించుకుని మైదానంలోకి దిగేందుకు తహతహలాడుతున్నాడు. సిరీ ‘ఏ’ లీగ్‌లో ఆడేందుకు గాను ఈనెల 5న ఇటలీకి చేరుకున్న ఈ స్టార్‌ ౖస్ట్రెకర్‌ ఆ దేశ నిబంధనలకు అనుగుణంగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. ఇప్పటికే జువెంటస్‌ జట్టులోని కొంత మంది ఆటగాళ్లు ప్రాక్టీస్‌ మొదలుపెట్టారని వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే..నిబంధనలు కచ్చితంగా పాటిస్తేనే..లీగ్‌ మొదలవుతుందని ఇటలీ ప్రధాన మంత్రి గుసెపీ కాంటె సోమవారం స్పష్టం చేశారు.