మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 25, 2020 , 10:30:34

కరోనాపై పోరు: రొనాల్డో సాయం

కరోనాపై పోరు: రొనాల్డో సాయం

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్​పై పోరుకు పోర్చుగల్ దిగ్గజ ఫుట్​బాలర్ క్రిస్టియానో రొనాల్డో సాయమందించాడు. ఫుట్​బాల్ ఏజెంట్​ జార్జ్ మెండెస్​తో కలిసి ఓ దవాఖానాకు కి ఖరీదైన వైద్య పరికరాలను అందజేశాడు.

పోర్చుగల్ రాజధాని లిస్బన్​లోని శాంటా మారియా దవాఖానాకు దాదాపు 1.08మిలియన్ డాలర్ల విలువైన వెంటిలేటర్లు, హార్ట్ మానిటర్లు, ఇన్​ఫ్యూజన్ పంపులు, 10 పడకలు, సిరంజీలు తదితర పరికరాలను రొనాల్డో, మెండెస్ అందజేశారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

 ‘సాయం చేసేందుకు ముందుకొచ్చిన రొనాల్డో, మెండెస్​కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఇదెంతో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ దేశానికి ఏదో ఒకటి చేయాల్సి సమయమిది’ అని దవాఖానా పాలక మండలి అధ్యక్షుడు పాలో బార్బోసా చెప్పారు. పోర్చుగల్​లో ఇప్పటి వరకు మొత్తం 2,362 కరోనా కేసులు నమోదవగా, 29మంది మృతి చెందారు. ​ 

టోక్యోకు బ్రేక్‌ : ఏడాది వాయిదా


logo
>>>>>>