సోమవారం 30 మార్చి 2020
Sports - Jan 30, 2020 , 17:16:40

వావ్‌!! రొనాల్డో ఇన్‌స్టా @ 200 మిలియన్లు

వావ్‌!! రొనాల్డో  ఇన్‌స్టా @ 200 మిలియన్లు

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లను కలిగిన వ్యక్తిగా రొనాల్డొ సరికొత్త రికార్డు సృష్టించాడు.

లండన్‌:  వరల్డ్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో సోషల్‌ మీడియలో దూసుకుపోతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లను కలిగిన సెలబ్రిటీగా రొనాల్డొ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడి  ఫాలోవర్ల సంఖ్య 200మిలియన్లు దాటింది. గొప్ప మైలురాయి చేరుకోవడంలో భాగస్వాములైన  తన అభిమానులకు, ఫాలోవర్లకు రొనాల్డో కృతజ్ఞతలు తెలిపాడు. వావ్‌ 200 మిలియన్లు!!   ప్రతి ఒక్కరికి థాంక్యూ అని రొనాల్డొ ఇన్‌స్టాలో వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా గతంలో ఇదే ఫ్లాట్‌ఫామ్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోలతో రూపొందించిన వీడియోను ఫాలోవర్లతో పంచుకున్నాడు. ఈ అరుదైన రికార్డు నెలకొల్పిన తొలి వ్యక్తిగా రొనాల్డో నిలువడం విశేషం.

పోర్చుగల్‌ జాతీయ జట్టు కెప్టెన్‌ రొనాల్డో తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్‌ చేసే ఒక్కో స్పాన్సర్డ్‌ పోస్ట్‌కు సుమారు 9లక్షల యూరోల  మొత్తాన్ని తీసుకుంటాడని మార్కెటింగ్‌ కంపెనీ ఒకటి ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు కలిగిన సెలబ్రిటీలు  డబ్బులు తీసుకుని ఏదైనా ఉత్పత్తికో, సంస్థకో ప్రచారం చేస్తూ స్పాన్సర్డ్ పోస్ట్‌లు పెడుతుంటారు. రొనాల్డో తర్వాత అరియానా గ్రాండే(173M), డ్వేన్‌ జాన్సన్(170M)‌, సెలీనా గోమెజ్(167M‌, కైలీ జెన్నర్(160M)‌, కిమ్‌ కర్దాషిన్(158M), లియోనెల్‌ మెస్సీ(148M), బేయాన్స్(139M)‌, నెయ్‌మర్‌(132M) అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్నారు.logo