శనివారం 28 మార్చి 2020
Sports - Jan 25, 2020 , 12:55:35

నాయిస్‌ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రోహిత్‌ శర్మ

నాయిస్‌ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రోహిత్‌ శర్మ

ముంబై: స్మార్ట్‌ యాక్ససరీల తయారీదారు నాయిస్‌ ప్రముఖ క్రికెటర్‌ రోహిత్‌ శర్మను తమ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ క్రమంలో నాయిస్‌ కంపెనీ విడుదల చేసే స్మార్ట్‌ వియరబుల్స్‌కు రోహిత్‌ శర్మ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. నాయిస్‌ కంపెనీ త్వరలో విడుదల చేయబోయే నాయిస్‌ ఫిట్‌ ఫ్యుషన్‌ హైబ్రిడ్‌ స్మార్ట్‌వాచ్‌తోపాటు రోహిత్‌ శర్మ నాయిస్‌ కంపెనీతో కలిసి స్వయంగా విడుదల చేయబోయే లిమిటెడ్‌ ఎడిషన్‌ వాచ్‌కు కూడా రోహిత్‌ శర్మ ప్రచారం చేయనున్నారు. ఈ సందర్భంగా నాయిస్‌ కంపెనీ ఫౌండర్‌ గౌరవ్‌ ఖాత్రి మాట్లాడుతూ ప్రముఖ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ తమ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనుండడం సంతోషకరమని అన్నారు. యువతలో రోహిత్‌ శర్మకు ఉన్న ఫాలోయింగ్‌ దృష్ట్యా ఆయనను తమ కంపెనీ ప్రచారకర్తగా నియమించుకున్నామని తెలిపారు. రోహిత్‌ శర్మ మాట్లాడుతూ నాయిస్‌ కంపెనీ వియరబుల్‌ డివైసెస్‌ వల్ల ప్రతి ఒక్కరూ తమ ఫిట్‌నెస్‌ స్థాయిని పెంచుకోవచ్చని తెలిపారు. 


logo