సోమవారం 06 జూలై 2020
Sports - Apr 16, 2020 , 18:16:51

లాక్​డౌన్​లో రోహిత్​ శర్మ దినచర్య ఇదే..

లాక్​డౌన్​లో రోహిత్​ శర్మ దినచర్య ఇదే..

ముంబై: కరోనా వైరస్ కారణంగా లాక్​డౌన్ ఉండడంతో భారత స్టార్ ఓపెనర్ రోహిత్​ శర్మ ఇంట్లోనే ఉంటూ సమయాన్ని తన భార్య, కూతురుతో సంతోషంగా గడుపుతున్నాడు. అలాగే ఫిట్​నెస్​ను కాపాడుకునేందుకు శ్రమిస్తున్నాడు. ఇంటి పనుల్లో పాలుపంచుకుంటున్నాడు. ఈ వీడియోను రోహిత్ శర్మ బుధవారం ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు. లాక్​డౌన్​లో తన దినచర్య ఇదేనంటూ అభిమానులకు తెలిపాడు.

వీడియోలో తొలుత ఫిట్​నెస్ కోసం వర్కౌట్లు చేసిన రోహిత్ వెంటనే డ్రింక్​ తాగాడు. ఆ తర్వాత కూతురు సమైరా, భార్య రితికతో బోర్డ్​గేమ్ ఆడాడు. ఇంటి పనులు, వంట సైతం చేశాడు.  ఆ తర్వాత కుటుంబంతో కలిసి టీవీ చూశాడు. ఈ వీడియోను ‘మై డే ఇన్ లాక్​డౌన్’ పేరుతో ఇన్​స్టాలో రోహిత్ పోస్ట్ చేశాడు. 

View this post on Instagram

????

A post shared by Rohit Sharma (@rohitsharma45) on


logo