మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Nov 12, 2020 , 02:21:33

రోహిత్‌ను కెప్టెన్‌ చేయాలి

రోహిత్‌ను  కెప్టెన్‌ చేయాలి

గౌతీ

న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్‌కు ఐదోసారి ఐపీఎల్‌ టైటిల్‌ అందించిన రోహిత్‌ శర్మను టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల జట్లకు కెప్టెన్‌ చేయాలన్న వాదన మరోసారి తెరపైకి వచ్చింది. టీ20 క్రికెట్‌లో ఇంత విజయవంతమవుతున్న హిట్‌మ్యాన్‌ను భారత సారథిగా చేయాల్సిందేనని మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. ‘భారత అత్యంత విజయవంతమైన సారథిగా ధోనీని పరిగణిస్తాం. అతడు ప్రపంచకప్‌లతో పాటు మూడు ఐపీఎల్‌ టోర్నీలను గెలిచాడు. రోహిత్‌ కూడా ఐదుసార్లు ఐపీఎల్‌ టైటిళ్లను గెలిపించాడు. టోర్నీ చరిత్రలో అత్యంత విజయవంతమైన సారథిగా ఉన్నాడు. భారత పరిమిత ఓవర్ల జట్టుకు రోహిత్‌ను కెప్టెన్‌ చేయాలి ’  అని గంభీర్‌ చెప్పాడు.