మూడో టెస్టు: మయాంక్ స్థానంలో రోహిత్!

సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోదిగే అవకాశం ఉంది. గురువారం నుంచి ఆరంభంకానున్న టెస్టులో టాప్ఆర్డర్లో మయాంక్ అగర్వాల్ స్థానంలో హిట్‌మ్యాన్ రోహిత్ తుది జట్టులోకి రానున్నాడు. సిడ్నీ క్రికెట్ మైదానంలో భారత జట్టు నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నది. అందరి దృష్టి రోహిత్ శర్మపైనే ఉంది. పేస్, స్పిన్ బౌలర్లను రోహిత్ ధాటిగా ఎదుర్కొన్నాడు.
అగర్వాల్ ఎనిమిది టెస్టు ఇన్నింగ్స్‌లో ఏడుసార్లు దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతనిపై వేటుఖాయంగా తెలుస్తోంది. మూడో పేసర్ ఎంపికపై టీమ్ఇండియా మేనేజ్మెంట్ కసరత్తులు చేస్తోంది. గాయంతో సిరీస్ నుంచి వైదొలిగిన ఉమేశ్ యాదవ్ స్థానంలో శార్దుల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిసింది.
భారత జట్టు అంచనా:
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, పుజారా, రహానె(కెప్టెన్), హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), జడేజా, అశ్విన్, మహ్మద్ సిరాజ్, బుమ్రా, శార్దుల్ ఠాకూర్/నవదీప్ సైనీ
తాజావార్తలు
- ప్రేమ వివాహం.. దళిత జంటకు 2.5 లక్షలు జరిమానా
- దొరస్వామి పార్దీవ దేహానికి ప్రముఖుల నివాళులు
- పీఎఫ్ కార్యాలయంలో సీబీఐ తనిఖీలు
- ధోనీని మించిన రిషబ్ పంత్.. కొత్త రికార్డు
- ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- 24 గంటల్లో 10064 మందికి కరోనా పాజిటివ్
- వీడియో : వాసన చూడండి..బరువు తగ్గండి
- వరుణ్ తేజ్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల
- కాళేశ్వరం పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్
- కావాల్సినవి 145 పరుగులు.. చేతిలో 7 వికెట్లు