అలా ఔటైనందుకు బాధ లేదు: రోహిత్ శర్మ

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ పేలవ షాట్ ఆడి ఔటయ్యాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన బ్యాటింగ్ తీరుపై వస్తున్న విమర్శలను రోహిత్ తిప్పికొట్టాడు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయన్ బౌలింగ్‌లో ఏరియల్ షాట్ ఆడి ఔటైనందుకు చింతించడంలేదని రోహిత్ చెప్పాడు. లయన్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టే ప్రయత్నంలో హిట్‌మ్యాన్ వికెట్ పారేసుకున్నాడు. రోహిత్ పూర్తి బాధ్యతారాహిత్యంగా ఆడాడని మాజీ కెప్టెన్ సునీల్ గావాస్కర్ విమర్శించిన విషయం తెలిసిందే.
'కొన్ని ఓవర్లు ఆడిన తర్వాత బంతి ఎక్కువగా స్వింగ్ అవడంలేదని గుర్తించాను. దానికనుగుణంగా మారిపోయాను. నేను ఎలా ఆడాలనుకున్నానో అలానే ఆడాను. ఆ షాట్ ఆడినందుకు ఎలాంటి బాధ లేదు. భారీ షాట్ ఆడి ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచాలనుకున్నాను. బౌలర్లపై ఒత్తిడి తెస్తూ పరుగులు రాబట్టడం నా బాధ్యత. పరుగులు రాబట్టడం ఇరు జట్లకు కష్టమైనప్పుడు పైచేయి సాధించేందుకు బౌలర్లపై ఒత్తిడి పెంచాలను చూస్తారు. ఈ క్రమంలో కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి. దురదృష్టవశాత్తు నేను ఔటయ్యానని' వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
కోహ్లీ ఉంటే కథ వేరేలా ఉండేది..!
రోహిత్ శర్మ ఔట్.. ఇండియా 62/2
హార్ధిక్ పాండ్యా తండ్రి కన్నుమూత
Nathan Lyon's 397th Test wicket seemed to come out of nowhere and the Aussies were pumped! #OhWhatAFeeling #AUSvIND | @Toyota_Aus pic.twitter.com/rIhl4ZjbTu
— cricket.com.au (@cricketcomau) January 16, 2021
తాజావార్తలు
- కోటక్ చేతికి ఆర్మీ జవాన్ల వేతన ఖాతాలు!
- అదనపు భద్రత+ ఏబీఎస్‌తో విపణిలోకి బజాజ్ ప్లాటినా-110
- మిల్క్ టూ వంటనూనెల ధరలు ‘భగభగ’!..
- ఎమ్మెల్సీ పదవి అంటేనే రాంచందర్‌రావుకు చిన్నచూపు
- ప్రైవేట్ ఉద్యోగాల రిజర్వేషన్ హర్యానాకు డిజాస్టర్:ఫిక్కీ
- సీఎం కేసీఆర్‌కు టీయూడబ్ల్యూజే కృతజ్ఞతలు
- దేశవ్యాప్తంగా 1.77 కోట్ల మందికిపైగా కరోనా టీకా
- బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఐటీ దాడులు
- శ్రీశైల మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం
- ఉత్పత్తి కేంద్రం నుంచి భారీగా మొసళ్లు మాయం