గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 03, 2020 , 16:54:48

భారత్‌కు ఎదురుదెబ్బ.. కివీస్‌ టూర్‌ నుంచి రోహిత్‌ ఔట్‌

భారత్‌కు ఎదురుదెబ్బ.. కివీస్‌ టూర్‌ నుంచి రోహిత్‌ ఔట్‌

గాయం కారణంగా వైస్‌కెప్టెన్‌ రోహిత్‌ న్యూజిలాండ్‌తో వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు.

ఆక్లాండ్‌:  టీ20ల్లో ఆల్‌రౌండ్‌ షోతో న్యూజిలాండ్‌ను వైట్‌వాష్‌ చేసిన టీమ్‌ ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా వైస్‌కెప్టెన్‌ రోహిత్‌ న్యూజిలాండ్‌తో వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు.  ఆదివారం ఆఖరిదైన ఐదో టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా రోహిత్‌కు గాయమైంది. అర్ధశతకం అనంతరం పరుగు తీస్తుండగా  రోహిత్‌ పిక్క పట్టేయడంతో మైదాన్ని వీడాడు.   రోహిత్‌ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను వన్డే జట్టుకు ఎంపిక చేశారు.  గతేడాది డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో వన్డేల సందర్భంగా అగర్వాల్‌ అరంగేట్రం చేశాడు.  కివీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టును ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. 

బ్లాక్‌క్యాప్స్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఇప్పటికే శిఖర్‌ ధావన్‌ దూరమైన విషయం తెలిసిందే.  టెస్టు ఓపెనర్‌గా అద్భుత ఆటతీరుతో మెప్పించిన రోహిత్‌ కివీస్‌తో రెండు టెస్టులకు  దూరమవడం కోహ్లీసేనను ఆందోళన కలిగించే విషయమే.  ఫైనల్ టీ20కి విరాట్‌ కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో రోహిత్‌ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. భారత్‌ ఇన్నింగ్స్‌లో అర్ధశతకం పూర్తి చేసిన తర్వాత అతడు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగి ఫీల్డింగ్‌ చేయడానికి కూడా రాలేదు. దీంతో జట్టు సారథ్య బాధ్యతలు స్వీకరించిన కేఎల్‌ రాహుల్‌ హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో విజయాన్నందించాడు. 


logo
>>>>>>