గురువారం 02 జూలై 2020
Sports - Jun 06, 2020 , 15:10:56

నా భార్య అందుకే ఏడ్చింది..: రోహిత్‌ శర్మ

నా భార్య   అందుకే ఏడ్చింది..:  రోహిత్‌ శర్మ

ముంబై  కరోనా లాక్‌డౌన్‌తో భారత క్రికెటర్లు తమ ఇళ్లలో ఉంటూ ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు, చర్చల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా భారత  క్రికెటర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్  BCCI.tVలో నిర్వహించిన 'ఓపెన్‌ నెట్స్‌ విత్‌ మయాంక్‌' షోలో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా భారత్‌ క్రికెట్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో  జరిగిన కొన్ని మధురానుభూతులను పంచుకున్నారు. 

వన్డే క్రికెట్లో మూడు డబుల్‌ సెంచరీలు సాధించి అంతర్జాతీయ క్రికెట్లో ఎవరికీ సాధ్యంకాని రికార్డు నెలకొల్పిన ఏకైక క్రికెటర్‌గా రోహిత్‌ కొనసాగుతున్నాడు.   రోహిత్‌ తన మూడో డబుల్‌ సెంచరీని గుర్తు చేసుకుంటూ, తన భార్య రితికా మొహాలి స్టాండ్స్‌లో కన్నీళ్లు పెట్టుకోవడానికి గల కారణాన్ని చాట్‌ షోలో వెల్లడించాడు. 

'ఎందుకు ఏడ్చావు అని నేను ఆమెను అడిగాను?  వ్యక్తిగత స్కోరు 196 పరుగుల వద్ద నేను డైవ్‌ చేయాల్సి వచ్చింది. అప్పుడు నా చేతికి ఏమైనా గాయమైందని ఆమె అనుకున్నది. అందుకే ఆమె ఎంతో బాధపడింది. వాస్తవానికి నేను డైవ్‌ చేయడంవల్లే ఆమె భావోద్వేగానికి లోనైందని' రోహిత్‌ వివరించాడు.  

మూడో డబుల్‌ సెంచరీ తనకెంతో ప్రత్యేకమైనదని మయాంక్‌తో  చెప్పాడు. ఆ రోజే మా వివాహ వార్షికోత్సవమని తెలిపాడు.  2017లో భారత్‌, శ్రీలంక మధ్య రెండో వన్డే మొహాలిలో జరిగింది. వన్డేల్లో హిట్‌మ్యాన్‌ ఏకంగా మూడు ద్విశతకాలను తనపేరిట లిఖించుకున్నాడు. శ్రీలంకపై రెండు, ఆస్ట్రేలియా(2013)పై ఒకటి సాధించాడు. logo