మంగళవారం 19 జనవరి 2021
Sports - Jan 01, 2021 , 15:29:38

రోహిత్ శ‌ర్మ‌కు వైస్ కెప్టెన్సీ

రోహిత్ శ‌ర్మ‌కు వైస్ కెప్టెన్సీ

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న చివ‌రి రెండు టెస్ట్‌ల‌కు రోహిత్ శ‌ర్మ వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు తీసుకోనున్నాడు. రెండో టెస్ట్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్న పుజారా స్థానంలో రోహిత్‌కు ఆ బాధ్య‌త‌లు ఇచ్చారు. గాయం కార‌ణంగా వ‌న్డేలు, టీ20ల‌తోపాటు తొలి రెండు టెస్ట్‌లకు దూర‌మైన రోహిత్‌.. ఈ మ‌ధ్యే టీమ్‌తో క‌లిసిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే అత‌డు మెల్‌బోర్న్‌లో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. అత‌ని రాక‌తో భార‌త బ్యాటింగ్ బ‌లోపేత‌మైంది. ముఖ్యంగా కోహ్లి కూడా లేని నేప‌థ్యంలో మిగ‌తా రెండు టెస్టుల్లో రోహిత్ కీల‌క పాత్ర పోషించనున్నాడు.