శనివారం 04 జూలై 2020
Sports - Jul 01, 2020 , 01:16:19

రోహిత్‌ గ్రేట్‌ ఓపెనర్‌

రోహిత్‌ గ్రేట్‌ ఓపెనర్‌

  • ఆల్‌టైం బెస్ట్‌ జాబితాలో టాప్‌-3లో ఉంటాడు
  • టీమ్‌ఇండియా మాజీ సారథి శ్రీకాంత్‌ 
  • కెప్టెన్సీ మార్పు తెరపైకి వస్తే హిట్‌మ్యాన్‌ సిద్ధం: ఆకాశ్‌ చోప్రా   

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. మాజీల నుంచి ప్రస్తుత ఆటగాళ్ల వరకు హిట్‌మ్యాన్‌ను పొగుడుతూనే ఉన్నారు. ఓపెనర్‌గా అతడి భీకరమైన ఆటతో పాటు నాయకత్వ లక్షణాలను ప్రశంసిస్తున్నారు. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ కృష్ణమాచారి  శ్రీకాంత్‌ తాజాగా ఈ జాబితాలో చేరాడు. ఆల్‌టైం అత్యుత్తమ వన్డే ఓపెనర్లలో రోహిత్‌ శర్మ ఒకడిగా ఉంటాడని మంగళవారం ఓ టీవీషోలో శ్రీకాంత్‌ అన్నాడు. ‘ప్రపంచ క్రికెట్‌లో ఆల్‌టైం అత్యుత్తమ వన్డే ఓపెనర్లలో రోహిత్‌ను ఒకడిగా నేను గుర్తిస్తా. ఆ జాబితాలో టాప్‌-3 లేదా 5లో అతడు ఉంటాడు. రోహిత్‌ శతకాలు, ద్విశతకాలు చేసే తీరు అత్యద్భుతంగా ఉంటుంది. వన్డే మ్యాచ్‌లో 150, 180, 200 పరుగులు చేయడం విశేషం. జట్టు స్కోరు ఎక్కడికో వెళ్లిపోతుంది. ఇలా ఎన్నోసార్లు భారీస్కోర్లు చేయడమే రోహిత్‌ గొప్పతనం’ అని కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నాడు. రోహిత్‌ శర్మ ఇప్పటి వరకు 224 వన్డేలు ఆడి 29శతకాలు సహా 9115 పరుగులు చేశాడు. 2014లో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా శ్రీలంకపై 264పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించి.. ఊహించేందుకే కష్టసాధ్యమైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.    

సారథ్యానికి రోహిత్‌ సరైనోడు: చోప్రా 

ఒకవేళ భారత జట్టుకు కెప్టెన్‌ను మార్చాలనుకుంటే జట్టు పగ్గాలు చేపట్టేందుకు రోహిత్‌ శర్మ అన్ని విధాలా సామర్థ్యమున్న ఆటగాడని కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. విరాట్‌ సారథ్యం చేపట్టాక  భారత జట్టు ఒక్క ఐసీసీ టోర్నీని కూడా గెలువలేకపోవడంతో పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు హిట్‌మ్యాన్‌ను సారథిని చేయాలని కొందరు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో చోప్రా మంగళవారం ఓ యూట్యూబ్‌ చానెల్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘వచ్చే 10-12నెలలు కెప్టెన్‌గా కోహ్లీనే ఉంటాడు. త్వరలో టీ20 ప్రపంచకప్‌ ఉంది. ఆ తర్వాత భారత్‌లో వన్డే వరల్డ్‌ కప్‌ ఉంది. ఈ టోర్నీలను భారత్‌ గెలువాలని కోరుకుంటున్నా. ఒకవేళ ఏదీ గెలువలేకుంటే కెప్టెన్సీ మార్పు అంశం తెరపైకి వస్తుంది. అలాంటి పరిస్థితి వస్తే కెప్టెన్సీ చేపట్టేందుకు రోహిత్‌ శర్మ.. అన్ని విధాలా తయారుగా ఉన్న ఆప్షన్‌గా ఉంటాడు. కెప్టెన్‌గా ఉన్నా.. లేకున్నా విరాట్‌ కోహ్లీ ఆటతీరులో మార్పు ఉండదు. ఎందుకంటే ఎప్పటికీ ఫామ్‌ తగ్గే అవకాశం లేని స్థాయికి కోహ్లీ చేరుకున్నాడు’ అని ఆకాశ్‌ చోప్రా అన్నాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ముంబై ఇండియన్స్‌కు నాలుగుసార్లు టైటిల్‌ అందించి.. లీగ్‌లో అత్యంత విజయవంతమైన సారథిగా ఉన్నాడు. అలాగే ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్‌  శర్మ అద్భుతంగా ఆడతాడని ఆ దేశ మాజీ బ్యాట్స్‌మన్‌  మైకేల్‌  హస్సీ అభిప్రాయపడ్డాడు. 

ఓపెనర్‌గా మారాకే రోహిత్‌ విజృంభణ 

2013 చాంపియన్స్‌ ట్రోఫీలో ఓపెనర్‌గా అవతారమెత్తాకే రోహిత్‌ శర్మలోని అద్భుతమైన ఆట బయటపడింది. అంతకు ముందు సాధారణ స్థాయి ఆటగాడిగా తీవ్ర ఒడిదొడుకులను  అతడు ఎదుర్కొన్నాడు. ఆ టోర్నీలో రోహిత్‌ను ఓపెనింగ్‌కు పంపాలని ధోనీ నిర్ణయించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి నుంచి విశ్వరూపం చూపించిన రోహిత్‌.. వన్డేల్లో శతకాల మోత మోగించాడు. ఏకంగా మూడు ద్విశతకాలు బాదాడు. గతేడాది టెస్టుల్లోనూ ఓపెనర్‌గా మారాక.. శతకాలతో రాణించాడు. వన్డేల్లో ఓపెనర్‌ కాకముందు.. తర్వాత రోహిత్‌ ప్రదర్శనను పరిశీలిస్తే.. ఇన్నింగ్స్‌
పరుగులు
సగటు
శతకాలు
 స్ట్రయిక్‌ రేట్‌ 
మొత్తం  వన్డేలు 
224911549.272988.92
ఓపెనర్‌గా
138714858112792.26
ఓపెనర్‌ కాకుండా
79196731.72278.58
logo