సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Jan 25, 2020 , 09:37:05

హిట్‌మ్యాన్‌ సూపర్‌ క్యాచ్‌

హిట్‌మ్యాన్‌ సూపర్‌ క్యాచ్‌

న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో బ్యాట్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన రోహిత్‌ శర్మ తన సూపర్‌ ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు.

ఆక్లాండ్‌:  న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో  బ్యాట్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన రోహిత్‌ శర్మ తన సూపర్‌ ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. కివీస్‌ ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌లో శివమ్‌ దూబే వేసిన బంతిని గప్టిల్‌ సిక్సర్‌గా మలిచేందుకు ప్రయత్నించగా.. మిడ్‌ వికెట్‌లో బౌండరీలైన్‌ దగ్గర రోహిత్‌ కండ్లు చెదిరే క్యాచ్‌ అందుకొని  అతడిని ఔట్‌ చేశాడు. బౌండరీ దాటి వెళ్తున్న బంతిని చురుగ్గా అందుకున్న హిట్‌మ్యాన్‌ అదే సమయంలో తనను తాను నియంత్రించుకునేందుకు బంతిని మరోసారి గాల్లోకి విసిరి ఆ తర్వాత నింపాదిగా ఒడిసిపట్టాడు. భారత్‌కు కీలక సమయంలో వికెట్‌ దక్కింది. దీంతో కివీస్‌ మరింత భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది.  ప్రస్తుతం రోహిత్‌ పట్టిన క్యాచ్‌ విన్యాసాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  

logo