గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Oct 04, 2020 , 15:59:59

MI vs SRH: తొలి ఓవర్‌లోనే రోహిత్‌ శర్మ ఔట్‌

MI vs SRH: తొలి ఓవర్‌లోనే రోహిత్‌ శర్మ ఔట్‌

షార్జా: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో  ముంబై ఇండియన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది.  కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌లోనే వెనుదిరిగాడు. సందీప్‌ శర్మ బౌలింగ్‌లో నాలుగో బంతిని భారీ సిక్సర్‌ బాదిన హిట్‌మ్యాన్‌ తర్వాతి బంతికే వికెట్‌ కీపర్‌ బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.  వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ దూకుడుగా ఆడుతున్నాడు.

సిద్ధార్థ్‌ కౌల్‌ వేసిన మూడో ఓవర్లో    తొలి బంతికే డికాక్‌ ఒక ఫోర్‌ కొట్టాడు.  అదే ఓవర్‌లో  సూర్యకుమార్‌ వరుసగా  మూడు ఫోర్లు బాది 18 రన్స్‌ రాబట్టాడు. సందీప్‌ శర్మ, టీ నటరాజన్‌ కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో ముంబై ఆచితూచి ఆడుతోంది.  5 ఓవర్లు ముగిసేసరికి ముంబై వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. సూర్యకుమార్‌(18), డికాక్‌(12) క్రీజులో ఉన్నారు.