ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Jan 16, 2021 , 10:28:35

రోహిత్ శ‌ర్మ ఔట్‌.. ఇండియా 62-2

రోహిత్ శ‌ర్మ ఔట్‌.. ఇండియా 62-2

బ్రిస్బేన్‌:  ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న నాలుగ‌వ టెస్టు రెండ‌వ రోజు టీ విరామ స‌మయానికి భార‌త్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 62 ర‌న్స్ చేసింది.  44 ప‌రుగులు చేసిన రోహిత్ శ‌ర్మ క్యాచ్ ఔట‌య్యాడు.  క్రీజ్‌లో పుజారా, ర‌హానేలు ఉన్నారు.  ఆసీస్ బౌల‌ర్ల ధాటిని నిలదొక్కుకునేందుకు భార‌త్ ప్ర‌య‌త్నిస్తున్న‌ది.  రెండ‌వ సెష‌న్‌లో రోహిత్ కొంత ధాటిగా ఆడారు.  స్వేచ్ఛ‌గా షాట్లు కొట్ట‌గ‌లిగాడు.  74 బంతులు ఆడిన రోహిత్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు ఉన్నాయి. రోహిత్ వికెట్ తీసిన ల‌యాన్‌.. మ‌రో మూడు వికెట్లు తీస్తే.. 400 వికెట్ల క్ల‌బ్‌లో చేరుతాడు. అంత‌క‌ముందు ఆస్ట్రేలియా త‌న తొలి ఇన్నింగ్స్‌లో 369 ర‌న్స్‌కు ఆలౌటైంది.  న‌ట‌రాజ‌న్‌, సుంద‌ర్‌, శార్దూల్‌లు చెరో మూడేసి వికెట్లు తీసుకున్నారు.  


VIDEOS

logo