మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Nov 11, 2020 , 15:23:05

ఫైనల్లో రెండు అర్ధసెంచరీలు సాధించిన ఏకైక కెప్టెన్‌ రోహితే

 ఫైనల్లో  రెండు అర్ధసెంచరీలు సాధించిన ఏకైక కెప్టెన్‌ రోహితే

దుబాయ్: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో మరో అరుదైన రికార్డులు నెలకొల్పాడు.  తన సారథ్యంలో ముంబై ఏకంగా ఐదుసార్లు టైటిల్‌ నెగ్గి చరిత్ర సృష్టించింది.   రోహిత్‌ శర్మ (68), ఇషాన్‌ కిషన్‌ (33 నాటౌట్‌)  రాణించడంతో   157 పరుగుల  లక్ష్యాన్ని  ముంబై  18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

తొలిసారి ఫైనల్‌ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 బంతులు మిగిలుండగానే ఐదు వికెట్లతో విజయం సాధించింది. ఐపీఎల్‌ ఫైనల్లో కెప్టెన్‌గా రోహిత్‌ రెండు అర్ధసెంచరీలు సాధించి అరుదైన ఘనత అందుకున్నాడు.  2015 సీజన్‌లో కోల్‌కతా వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో  జరిగిన తుదిపోరులో  రోహిత్‌ 26 బంతుల్లోనే 50 రన్స్‌ పూర్తి చేశాడు. 

2016 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై 69 పరుగులు చేశాడు. మంగళవారం ముంబైతో మ్యాచ్‌లో  ఢిల్లీ సారథి  శ్రేయస్‌ అయ్యర్‌ (65 నాటౌట్‌) రాణించగా, ఐపీఎల్‌ 2013లో ముంబైపై చెన్నై కెప్టెన్‌   మహేంద్ర సింగ్‌ ధోనీ(63 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అంతిమపోరులో అత్యధిక స్కోరు చేసిన రికార్డు వార్నర్‌(69) పేరిట ఉన్నది.