మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 16, 2020 , 23:49:39

క్రీడాలోకానికి కరోనా కాటు

క్రీడాలోకానికి కరోనా కాటు

న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో క్రీడాలోకం మూగబోవడం విచారకరమని టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. ‘కొవిడ్‌-19’ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సురక్షితంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. సోమవారం రోహిత్‌ ట్విట్టర్‌ ద్వారా ఓ వీడియోను పంచుకున్నాడు. అందులో.. ‘గత కొన్ని వారాలుగా మనమంతా కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. క్రీడాలోకం స్తంభించిపోవడం విచారంగా ఉంది. ఇలాంటి సమయాల్లో ధైర్యంగా ఉండాల్సిన అవసరముంది. వైరస్‌ దరిచేరకముందే జాగ్రత్తలు పాటించాలి.


పరిసరాలపై ఓ కన్నేసి ఉంచి.. కాస్త అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. తమ ప్రాణాలను లెక్క చేయకుండా.. కరోనా బాధితులకు పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది కృషికి నా అభినందనలు. చివరగా ఒక్కమాట.. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి’ అని పేర్కొన్నాడు. అంతకుముందు కొవిడ్‌-19పై టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పందిస్తూ.. ‘ధైర్యంగా పోరాడాల్సిన సమయమిది’ అని అన్నాడు. ఈ మహమ్మారి బారినపడి మన దేశంలో ఇప్పటికే ఇద్దరు మృతిచెందగా.. మరో 114 మంది వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు.


logo
>>>>>>