గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Oct 31, 2020 , 15:38:05

రోహిత్‌శర్మ గాయాన్ని అంచనా వేయనున్న బీసీసీఐ

రోహిత్‌శర్మ గాయాన్ని అంచనా వేయనున్న బీసీసీఐ

దుబాయ్‌ : ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌శర్మ ఎదుర్కొంటున్న గాయం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందిని ఇబ్బందిపెడుతున్నది. ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టులో రోహిత్‌శర్మ పేరును పరిశీలనలో ఉంచినట్లు సెలక్షన్‌ కమిటీ పేర్కొన్నది. ఇది రోహిత్‌ అభిమానులతోపాటు క్రికెట్‌ పండితుల మధ్య చర్చనీయాంశంగా మారింది. స్నాయువు గాయం కారణంగా ముంబై ఇండియన్స్‌ చివరి మూడు మ్యాచ్‌లకు రోహిత్‌శర్మ దూరమయ్యాడు. పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాటి నుంచి తప్పించుకునేందుకు రోహిత్‌కు అయిన గాయాన్ని ఆదివారం నాడు అంచనా వేయాలన్న నిర్ణయానికి బీసీసీఐ వచ్చింది. ఇందుకోసం ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ కార్యనిర్వాహక బృందం వెల్లడించింది.

"రోహిత్ గాయం రేపు అంచనా వేస్తాం. ఆస్ట్రేలియాకు అతను వెళ్ళడం మంచిదా? కాదా? అనే దానిపై వైద్య బృందం నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోబడుతుంది. కండరాల గాయాల మాదిరిగానే, త్వరణం, క్షీణత ప్రక్రియను అర్థం చేసుకోవడంపై దృష్టి కేంద్రీకరించి పూర్తిగా కోలుకునేందుకు ఎంత సమయం అవసరం అన్నది నిర్ధారిస్తాం”అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. రోహిత్ స్నాయువు గాయంతో బాధపడ్డాడని చెప్తారు. అయితే దాని పరిధి పూర్తిగా అర్థం కాలేదు. అతనికి యూఏఈలోని ముంబై ఇండియన్స్‌ వైద్య బృందం చికిత్స అందిస్తున్నది. ఫిట్‌గా ఉండి నెట్స్‌లో జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. 

స్నాయువు గాయం మధ్యస్థంగా ఉంటే నవడానికి, సాధారణ షాట్లు ఆడటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, అయితే వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడంలో, ఫీల్డింగ్‌ చేయడం కారణంగా మళ్లీ తిరుగబెట్టే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో అతని గాయం మెరుగుదల సంకేతాలను చూపించినపక్షంలో రోహిత్ అన్ని ముఖ్యమైన సిరీస్‌లకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని క్రికెట్‌ పండితులు భావిస్తున్నారు. భారత జట్టు నవంబర్ 12 న ఆస్ట్రేలియా చేరుకుని మూడు టెస్టులు, వన్డే సిరీస్‌ ఆడనున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.