గురువారం 04 మార్చి 2021
Sports - Jan 18, 2021 , 11:46:47

స్మిత్ ముందే రోహిత్ శ‌ర్మ కూడా అదే ప‌ని చేశాడా.. వీడియో

స్మిత్ ముందే రోహిత్ శ‌ర్మ కూడా అదే ప‌ని చేశాడా.. వీడియో

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ స్టీవ్ స్మిత్ మూడో టెస్ట్‌లో చేసిన ప‌ని తెలుసు క‌దా. టీమిండియా బ్యాట్స్‌మ‌న్ రిష‌బ్ పంత్ బ్యాటింగ్ గార్డ్‌ను చెరిపేసే ప్ర‌య‌త్నం చేసి స్టంప్స్ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. అయితే ఈ ప‌నిని కూడా కంగారూలు స‌మ‌ర్థించుకున్నారు. అయితే ఇప్పుడు బ్రిస్బేన్ టెస్ట్‌లో టీమిండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ కూడా అలాగే చేశాడు. స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో అత‌డు చూస్తుండ‌గానే.. రోహిత్ షాడో బ్యాటింగ్ చేశాడు. అయితే స్మిత్ లాగా బ్యాటింగ్ గార్డ్‌ను రోహిత్ చెరిపేయ‌లేదు. కానీ అదే స‌మ‌యంలో కామెంట‌రీ బాక్స్‌లో ఉన్న సంజ‌య్ మంజ్రేక‌ర్ మాత్రం.. అప్పుడు స్మిత్ చేసింది త‌ప్ప‌యితే.. ఇది కూడా త‌ప్పే అనడం విశేషం. రోహిత్ కావాల‌నే స్మిత్ ముందు ఇలా చేశాడ‌ని అత‌ని బాడీ లాంగ్వేజ్ ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది. 

VIDEOS

తాజావార్తలు


logo