మంగళవారం 27 అక్టోబర్ 2020
Sports - Sep 23, 2020 , 20:45:06

రోహిత్‌ శర్మ హాఫ్‌సెంచరీ

రోహిత్‌ శర్మ  హాఫ్‌సెంచరీ

అబుదాబి: ఐపీఎల్‌-13లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ  హాఫ్‌సెంచరీ సాధించాడు. ఓపెనర్‌గా బరిలో దిగిన రోహిత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు.   39 బంతుల్లో ఒక ఫోర్‌, నాలుగు సిక్సర్ల సాయంతో అర్ధశతకం పూర్తి చేశాడు.  మరో బ్యాట్స్‌మన్‌ సూర్య కుమార్‌ యాదవ్‌(47) అర్ధశతకానికి చేరువలో రనౌటయ్యాడు.

ఇన్నింగ్స్‌ ఆరంభంలో కోల్‌కతా బౌలర్లపై ఎదురుదాడి చేసిన యాదవ్‌ ముంబైని పటిష్ఠస్థితిలో నిలిపాడు. రోహిత్‌, యాదవ్‌ జోడీ 90కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.12  ఓవర్లకు ముంబై 2 వికెట్లకు 105 పరుగులు చేసింది. క్రీజులో కుదురుకున్న రోహిత్‌ రెచ్చిపోతే ముంబై 180కి పైగా స్కోరు చేయగలదు. 


logo