శుక్రవారం 05 మార్చి 2021
Sports - Feb 13, 2021 , 16:19:07

స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే రెండు వికెట్లు కోల్పోయిన భార‌త్‌

స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే రెండు వికెట్లు కోల్పోయిన భార‌త్‌

చెన్నై: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో  టీమ్ ఇండియా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే రెండు కీల‌క   వికెట్లు కోల్పోయింది.  భారీ శ‌త‌కంతో  చెల‌రేగిన‌ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ(161: 231 బంతుల్లో 18ఫోర్లు, 2సిక్స‌ర్లు)  జాక్ లీచ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. రోహిత్ మ‌రో బ్యాట్స్‌మ‌న్ ర‌హానెతో క‌లిసి 150కి పైగా ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. మొయిన్ అలీ వేసిన 76వ ఓవ‌ర్లోనే ర‌హానె(67: 149 బంతుల్లో 9ఫోర్లు) బౌల్డ్ అయ్యాడు. క్రీజులో కుదురుకున్న జోడీ వెనుదిర‌గడంతో ఇంగ్లాండ్ ఊపిరిపీల్చుకున్న‌ది. 76 ఓవ‌ర్లు ముగిసేస‌రికి భార‌త్ 5 వికెట్ల న‌ష్టానికి 250 ప‌రుగులు చేసింది. రిష‌బ్ పంత్‌, అశ్విన్ క్రీజులో ఉన్నారు. 


VIDEOS

logo