మంగళవారం 19 జనవరి 2021
Sports - Dec 15, 2020 , 16:01:30

ఆస్ట్రేలియా ఫ్లైటెక్కిన రోహిత్ శ‌ర్మ‌

ఆస్ట్రేలియా ఫ్లైటెక్కిన రోహిత్ శ‌ర్మ‌

ముంబై:  టీమిండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ మొత్తానికి ఆస్ట్రేలియా ఫ్లైటెక్కాడు. గాయంతో వ‌న్డే, టీ20 సిరీస్‌లకు దూరంగా ఉన్న రోహిత్‌.. ఈ మ‌ధ్యే ఫిట్‌నెస్ నిరూపించుకున్న విష‌యం తెలిసిందే. దీంతో అత‌న్ని ఆస్ట్రేలియా పంపించాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించింది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుఝామున దుబాయ్ మీదుగా అత‌డు ఆస్ట్రేలియా వెళ్లిన‌ట్లు బోర్డు వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అక్క‌డ క్వారంటైన్‌లో ఉండాల్సి రావ‌డంతో ఆ స‌మ‌యంలో త‌న ఫిట్‌నెస్ మ‌రింత దృష్టి సారించ‌నున్నాడు. క్వారంటైన్ నిబంధ‌న‌ల కార‌ణంగా రోహిత్ తొలి రెండు టెస్టుల‌కు దూరం కానున్నాడు. మొద‌ట్లో మిగ‌తా టీమ్ స‌భ్యుల‌తోనే క‌లిసి రోహిత్‌ను ఆస్ట్రేలియా పంపించాల‌ని బోర్డు భావించినా.. త‌ర్వాత నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలో అత‌ను ఫిట్‌నెస్ కోసం కృషి చేశాడు. గ‌త శుక్ర‌వారం అత‌నికి ఫిట్‌నెస్ ప‌రీక్ష నిర్వ‌హించిన ఎన్‌సీఏ ఫిజియోలు.. రోహిత్‌కు క్లీన్‌చిట్ ఇచ్చారు. జ‌న‌వ‌రి 7న సిడ్నీలో ప్రారంభ‌మ‌య్యే మూడో టెస్ట్ స‌మ‌యానికి రోహిత్ టీమ్‌కు అందుబాటులో ఉంటాడు.